నేడు ధర్మసాగర్‌కు రానున్న రాష్ట్ర మంత్రులు

నేడు ధర్మసాగర్‌కు రానున్న రాష్ట్ర మంత్రులు

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవాదుల రిజర్వాయర్‌ను ఇవాళ సాయంత్రం 4:30కు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. గోదావరి నది జలాలు మూడో పైపులైన్ ద్వారా రిజర్వాయర్‌లో చేరుతున్న నేపథ్యంలో మంత్రులు దీనిని పరిశీలించనున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సందర్శనలో హాజరు కానున్నారు.