'రైతు భరోసా' దరఖాస్తుకు నేడే చివరి తేదీ..!
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న పెట్టుబడి సాయం 'రైతు భరోసా' పథకం దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పాసు బుక్ వచ్చిన వారు, ఇంకా దరఖాస్తు చేసుకోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్‌లు, మొబైల్ నంబర్ వివరాలను సమర్పించాలన్నారు.