సంజయ్ బెయిల్ పిటిషన్ డిస్మిస్
AP: IPS అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ACB కోర్టు డిస్మిస్ చేసింది. సంజయ్ బెయిల్‌ను కోర్టు డిస్మిస్ చేయడం ఇది మూడోసారి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేసిన సమయంలో సంజయ్ అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.