తెలంగాణ టీటీడీలో ధనుర్మాస ఉత్సవాలు

తెలంగాణ టీటీడీలో ధనుర్మాస ఉత్సవాలు

KMR: తిమ్మాపూర్ పరిధిలోని తెలంగాణ టీటీడీ ఆలయంలో ఈ నెల 16 నుంచి వచ్చే నెల 13 వరకు ధనుర్మాస ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధనుర్మాస దీక్షలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది.