VIDEO: డ్రైనేజీలో పడిన ఆవు దూడకు ప్రాణరక్షణ
BHPL: కాటారం మండలంలోని అంబేద్కర్ కూడలిలో డ్రైనేజీ కాలువలో పడిన ఆవు దూడను గురువారం రాత్రి స్థానికులు కాపాడారు. డ్రైనేజీ పై కప్పు ఉండడంతో దూడ బయటకు రాలేక ఇరుక్కుపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు జేసీబీ సహాయంతో గంటల పాటు శ్రమించి దూడను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దూడ తల్లి వద్దకు చేరడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.