'పదవ తరగతి పరీక్షలు భవిష్యత్తుకు పునాది'

'పదవ తరగతి పరీక్షలు భవిష్యత్తుకు పునాది'

SKLM: రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీటి సదుపాయం ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. జిల్లాలో 145 కేంద్రాల్లో 28,598 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు.