ఇంధన మార్కెట్లకు అగ్రరాజ్యాల అండ
యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకం కలగకుండా చేసేందుకు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు సిద్ధమయ్యాయి. ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు, సప్లై చైన్ దెబ్బతినకుండా ఉండేందుకు ఆ దేశాలు సహకరించనున్నట్లు ప్రకటించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశం.