అనంతపురంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌లలో త్రీటౌన్, ఈగల్ టీం పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా నార్కోటిక్స్ డిటెక్షన్ జాగిలం 'టైగర్' సహకారంతో రైళ్లు, బస్సులు, పార్సిల్ సర్వీసులను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, లగేజీ బ్యాగులను నిశితంగా పరిశీలించారు.