ములుగులో నేటి ప్రజావాణి రద్దు

MLG: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. నేడు జిల్లాలోని ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణ పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో నేటి ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.