నరసరావుపేటలో YCP నేతలు నిరసన
PLD: ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేటలో బుధవారం YCP నేతలు ఆందోళన చేపట్టాయి. ఆంధ్రజ్యోతి తీరును నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల మద్దతుతో ఈ ఉధ్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.