ఆసియా కప్‌లో టీమిండియా ఏం చేస్తుంది?

పాకిస్థాన్‌తో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇటీవల లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో ఆ దేశంతో ఆడాల్సిన మ్యాచ్‌లను భారత్ రద్దు చేసుకుంది. అయితే త్వరలో దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియా కప్‌లో షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్‌తో టీమిండియా ఆడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్‌లు రద్దయితే ఆసియా కప్ నిరాదరణకు గురయ్యే అవకాశం ఉంది.