ఏప్రిల్‌లోనూ మంచు సోయగాలు.. వేల మంది క్యూ

ఏప్రిల్‌లోనూ మంచు సోయగాలు.. వేల మంది క్యూ

జమ్మూకశ్మీర్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దోడా(D) గుల్దండాలో వసంతకాలంలోనే హిమపాతం కురిసింది. ఈ అరుదైన మంచు అందాలను ఆస్వాదించేందుకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. మంచు మైదానాల్లో విహరిస్తూ, స్లైడింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ అకాల హిమపాతంతో పర్యాటక రంగం కొత్త వెలుగులు సంతరించుకుంది. పర్యాటకులు ఇక్కడ ప్రకృతి అందాలను చూసి మైమరిచిపోతున్నారు.