VIDEO: మిన్నంటిన హోలీ సంబరాలు..
SRD: కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో యువకుల కేరింతల హోలీ సంబరాలు మిన్నంటాయి. చిన్న పెద్ద వయోభేదం లేకుండా హోలీ వేడుకల్లో మునిగితేలారు. తడ్కల్ గ్రామంలో ప్రధాన రహదారిలోని శివాజీ చౌక్ వద్ద యువకులు డిజే మ్యూజిక్ సౌండ్ మధ్య డాన్సులు చేశారు. అక్కడి ప్రాంగణమంతా రంగులమయంతో నిండిపోయింది. యువకుల ఆనందోత్సవాలకు అవధులు లేకుండా పోయాయి.