మంత్రిని కలిసిన మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్

మంత్రిని కలిసిన మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్‌ బల్లా పల్లవి మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. మార్కెట్ యార్డ్‌లో రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యార్డ్‌ను ఆధునీకరించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పల్లవి వివరించారు. అనంతరం స్థానిక రాజకీయాలపై చర్చించారు.