తిరుపతిలో డెల్లా వసుధైక టౌన్‌షిప్
AP: తిరుపతిలో డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. డెల్లా టౌన్‌షిప్స్ సంస్థ ద్వారా 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం వివరాలను ఆ సంస్థ నిర్వహకులు తెలిపారు.