VIDEO: భస్మ సహిత చందన అలంకరణలో దర్శనం

VIDEO: భస్మ సహిత చందన అలంకరణలో దర్శనం

AKP: చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరుడు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం భస్మ సహిత చందన అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వేకువజామునే అర్చకులు స్వామివారిని భస్మం, చందనంతో అలంకరించి మంగళ వాయిద్యాలతో ప్రధమార్చన, ప్రథమాభిషేకం చేసి దర్శనం కల్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో స్వామి రోజుకో వర్ణంలో భక్తులకు దర్శనం ఇస్తారని అర్చకుడు చలపతి తెలిపారు.