ట్రైనింగ్ ఒంటిగంట వరకే నిర్వహించాలి: TSUTF
SDPT: ఎండల తీవ్రత దృష్ట్యా జనాభా గణన (సెన్సస్) శిక్షణ తరగతులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నిర్వహించాలని TSUTF నాయకులు కోరారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సౌకర్యార్థం సమయ వేళల్లో మార్పులు చేయాలని TSUTF జిల్లా అధ్యక్షుడు వలి అహ్మద్, కార్యదర్శి యాదగిరి కోరారు.