తొలిరోజు ముగిసిన YCP నేత శ్రీకాంత్ రెడ్డి విచారణ

NLR: రుస్తుం మైన్స్‌లో 12వ నిందితులుగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. జిల్లా సెంట్రల్ జైలు నుంచి డీటీసీకి తరలించి విచారించారు. ఈ విచారణలో శ్రీకాంత్ రెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. రుస్తుం మైన్స్‌లో తన ప్రమేయంతో పాటు వైసీపీకి చెందిన కీలక నేతల జోక్యం గురించి కూడా పోలీసులకు చెప్పారని సమాచారం.