ప్రమాదం.. 14 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
TG: మీర్జాగూడ ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయిందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మరో ఐదు మృతదేహాలకు గంటలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పజెప్పుతామన్నారు. ప్రమాదంపై విచారణ జరుగుతుందని.. నివేదిక వచ్చాక అన్ని విషయాలు చెబుతామని వెల్లడించారు.