గ్రామాలకు నిలిచిన రాకపోకలు

గ్రామాలకు నిలిచిన రాకపోకలు

NZB: వర్ని మండలంలోని కోకల్ దాస్ తండా పైడిమల్ గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హన్మాజీపేట్ గ్రామానికి వెళ్లి బ్రిడ్జిపై నుంచి వరద నీరు పొంగుతుంది. వరద ఉదృతి తగ్గితేనే గ్రామాలకు రాకపోకలు కొనసాగుతాయి. అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తున్నారు.