అనకాపల్లి జిల్లా నుంచి 825 బస్సులు: కలెక్టర్

అనకాపల్లి జిల్లా నుంచి 825 బస్సులు: కలెక్టర్

విశాఖలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగ దినోత్సవానికి అనకాపల్లి జిల్లా నుంచి ప్రజలను తరలించడానికి 825 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం తెలిపారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సుకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తున్నామన్నారు. యోగా ముగిసిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు చేర్చే బాధ్యత ఉపాధ్యాయులదేదని కలెక్టర్ స్పష్టం చేశారు.