VIDEO: ఆసిఫాబాద్‌లో పత్తి రైతుల శాంతి ర్యాలీ

VIDEO: ఆసిఫాబాద్‌లో పత్తి రైతుల శాంతి ర్యాలీ

ఆసిఫాబాద్: కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలని, ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుల వద్ద ఉన్న పత్తిని పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆసిఫాబాద్‌లో రైతు హక్కుల పోరాట సమితి నాయకులు పత్తి రైతులతో కలసి శాంతి ర్యాలీ నిర్వహించారు. దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, 12 శాతం తేమ నుంచి 20శాతం వరకు సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.