VIDEO: కొట్టుకుపోతున్న డిండి మైనర్ బ్రిడ్జి
NGKL: అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న మైనర్ బ్రిడ్జి గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. నిన్న సగం వరకు కొట్టుకుపోయిన బ్రిడ్జి గురువారం ఉదయం పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో హైదరాబాద్ శ్రీశైలం రహదారిని అధికారులు మూసేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.