ఈతకు వెళ్లిన విద్యార్థి గల్లంతు

ఈతకు వెళ్లిన విద్యార్థి గల్లంతు

KRNL: సి.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి తెలుగు మధు మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రంగమ్మ, మద్దిలేటి వెతకగా బావి వద్ద కుమారుని దుస్తులు కనిపించాయి. సమాచారం అందుకున్న జాలర్లు బావిలో గాలించినా మధు ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.