ఉప్పగూడలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఉప్పగూడలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

HYD: పాతబస్తీ ఉప్పుగూడలో ఓ వ్యక్తి మృతి కలకలం రేపింది. రాజరాజేశ్వరీ బార్‌లో సాయినాథ్(38) అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఇవాళ మృతి చెందాడు. బార్‌లోనే అతడు కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వద్ద మాత్రలు, ఇంజెక్షన్లు, లిక్కర్ బాటిల్స్ లభ్యమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.