మడకశిరలో కొత్త బార్ మంజూరు

మడకశిరలో కొత్త బార్ మంజూరు

సత్యసాయి: మడకశిర పట్టణానికి ప్రభుత్వం కొత్త బార్‌ను మంజూరు చేసిందని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు. బార్ కోసం రూ. 35 లక్షల చలానా, రూ. 5.10 లక్షల అప్లికేషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 26 చివరి తేదీగా నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు, సీఐ మురళి కిషోర్ పాల్గొన్నారు.