మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ప్రజా విజేత పురస్కారం
కోనసీమ: రామచంద్రపురం మోడరన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం మోడరన్ ఫౌండేషన్ తరపున రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ప్రజా విజేత పురస్కారం అందజేసారు. ఈ సందర్బంగా మోడరన్ అధినేత డాక్టర్ లయన్ జి.వి.రావు మాట్లాడుతూ.. రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి సుభాష్‌కు ప్రజా విజేత పురస్కారం అందజేయడం ఆనందంగా ఉందన్నారు.