నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: సంగం మండలంలోని సంగం, సిద్దిపురం, మర్రిపాడు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ ఉడతా మన్మధరావు ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలియజేశారు. ప్రజలు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.