చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన గొట్టిపాటి
AP: అద్దంకి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.