దుర్గమ్మ సేవలో ఏపీ టీపీసీ ఛైర్మన్

దుర్గమ్మ సేవలో ఏపీ టీపీసీ ఛైర్మన్

SKLM: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో APCOS జనరల్ మేనేజర్ బి నాగ ప్రసాద్ పాల్గొన్నారు.