VIDEO: గుంటూరులో ఘనంగా హోంగార్డ్స్ 'రైజింగ్ డే'

VIDEO: గుంటూరులో ఘనంగా హోంగార్డ్స్ 'రైజింగ్ డే'

GNTR: గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం (రైజింగ్ డే) శనివారం ఘనంగా జరిగింది. ఏఆర్ ఏఎస్పీ హనుమంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ కొనియాడారు. విధి నిర్వహణలో వారు చూపుతున్న అంకితభావం అభినందనీయమన్నారు.