పోలీసుల వీక్లీ పరేడ్
మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పోలీసుల వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది పరేడ్‌లో పాల్గొన్ని ఫ్లాగ్ మార్చి చేపట్టారు. అనంతరం అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.