పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయింపు
MDCL: MMC ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పార్కులను అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉప్పల్ ZC రాధిక గుప్తా సర్కిల్ పరిధిలోని కాచివాని సింగారం, దివ్యానగర్, పోచారంలోని పార్కు స్థలాలను సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడారు. పార్కుల అభివృద్ధికి MMC ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో TPO రాజీవ్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.