డుంబ్రిగూడలో ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్లు
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో రహదారులకు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. రక్షణ కంచెలు లేకపోవడం, విద్యుత్ తీగలు కిందకు వేలాడడంతో పాదచారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల్లో మొక్కలు పెరగడంతో పశువులకు కూడా విద్యుదాఘాతం ప్రమాదం ఉందని తెలిపారు. వెంటనే రక్షణ కంచెలు ఏర్పాటు చేసి తీగలను సరిచేయాలని కోరుతున్నారు.