ప్రజాదర్బార్‌లో పాల్గొన్న లోకేష్

ప్రజాదర్బార్‌లో పాల్గొన్న లోకేష్

GNTR: తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి నారా లోకేష్ 61వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి భూ వివాదాలు, ఉపాధి, విద్య, పింఛన్ సమస్యలు విన్నవించారు. అర్జీలు స్వీకరించిన లోకేశ్ వాటిపై వెంటనే స్పందించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అన్ని సమస్యలపై పరిష్కారం అందించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.