అదుపు తప్పి ఆటో బోల్తా

అదుపు తప్పి ఆటో బోల్తా

MDK: ఆటో అదుపు తప్పి రోడ్డుకింద బోల్తా పడిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లికి చెందిన ఓ కుటుంబం దైవ దర్శనం కోసం చేగుంట మండలం కర్నల్ పల్లి ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.