అనకాపల్లిలో గృహ నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష

అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ఇంకా 4328 ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు ఆర్థిక సహాయం పొందిన వారు ఇళ్లు నిర్మించకపోతే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోజువారీ సమీక్షలతో పురోగతి సాధించాలని సూచించారు.