భార్య కాపురానికి రావడం లేదని..సెల్ టవర్ ఎక్కిన యువకుడు
KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో పవన్ అనే యువకుడు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సెల్ టవర్ ఎక్కాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకుని అతనితో మాట్లాడి కిందికి దించారు.