రైల్వే స్టేషన్ వెళ్లారా..? దీని అర్థం ఏంటో తెలుసా..?
HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ బోర్డుపై MSL +525.05M అని స్పష్టంగా కనిపిస్తోంది కదూ. రైల్వే స్టేషన్లు, ప్రముఖ ప్రాంతాల్లో మీరు దీన్ని చూసే ఉంటారు. అయితే.. MSL +525.05M అంటే అర్థం ఏంటంటే, సముద్ర మట్టానికి చర్లపల్లి స్టేషన్ +525.05 మీటర్ల ఎత్తులో ఉందని అర్ధం. ఈ వివరాలు రైల్వే ఇంజినీరింగ్, మార్గాల ప్రణాళికలో కీలకంగా ఉపయోగపడతాయని JE జైన్ సింగ్ తెలిపారు.