'మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు'

'మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు'

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ వి.నారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించి,వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మైనర్లు డ్రైవింగ్ చేయకూడదని అవగాహన కల్పించారు. మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.