VIDEO: కాలినడకన తిరుమలకు చేరుకున్న హీరో నాని

TPT: HIT 3 సినిమా విజయం సాధించాలని కోరుతూ హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టితో కలిసి శనివారం రాత్రి అలిపిరి కాలినడకన నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. తన వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని, ముఖానికి చేతి రుమాలు కట్టుకుని మెట్లు ఎక్కుతున్నట్లు నాని తెలిపారు. రాత్రి తిరుమలలో బస చేసి ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.