కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
AP: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నుంచి 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను టీడీపీ కార్యవర్గం వెల్లడించింది. 24న కడపల్లి నివాసం వద్ద ప్రజల నుంచి ఆర్జీల స్వీకరణతో పర్యటన ప్రారంభమవుతుంది. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగే ఈ పర్యటనను టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.