బచ్చకళ్లేశ్వర స్వామి జాతరలో డ్రోన్లతో నిఘా

బచ్చకళ్లేశ్వర స్వామి జాతరలో డ్రోన్లతో నిఘా

ATP: కనేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలో బచ్చకళ్లేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కనేకల్లు ఎస్సై నాగమధు జాతర పరిసర ప్రాంతంలో పరిస్థితులను సమీక్షించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బందోబస్తు చర్యలు తీసుకున్నారు.