గిరిజన అభ్యుదయ సేవా సంఘంపై ఆరోపణలు
BDK: చర్ల బస్టాండ్ సెంటర్‌లో గోండ్వాన సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీనియర్ నాయకులు గొంది ముయ్యన్న మాట్లాడారు. గిరిజన అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షుడు దుబ్బరాజు ఆదివాసి ఉద్యమ చరిత్రలో ఎప్పుడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా పార్టీలు మారుతూ ఆర్థిక స్వలాభం కోసం సంఘాన్ని ఏర్పాటు చేసి, దాని ముసుగులో అనేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.