‘ఇందిర మహిళ శక్తి’ చీరల పంపిణీ విజయవంతం చేయాలి'
SRPT: రాష్ట్ర ఆదేశాల మేరకు జిల్లాలో ‘ఇందిర మహిళ శక్తి’ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో బుధవారం నుంచి డిసెంబర్ 9 వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.