పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లపాడు వెంకటేశ్వర ఇండస్ట్రీస్ ప్రాంగణంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పత్తి రైతులకు కనీస మద్దతు ధరను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, CCI సంయుక్తంగా సీజన్ మొత్తం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.