నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: చాగల్లు మండలంలోని మల్లవరం విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండలంలోని గౌరిపల్లి, చంద్రవరం, మార్కొండపాడు తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని సూచించారు.