గార్లదిన్నెలో ఎడ్ల పందేల ప్రారంభం

గార్లదిన్నెలో ఎడ్ల పందేల ప్రారంభం

కొనకనమిట్ల మండలం గార్లదిన్నె పంచాయతీ పరిధిలోని వెలుగొండలో వేంకటేశ్వరస్వామి తిరుణాళ్ల సందర్భంగా బుధవారం ఎడ్ల పందాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్క గ్రామ ప్రజలు భారీగా వచ్చారు