నేడు జ్ఞానాపురంలో జాబ్ మేళా

నంద్యాల: జ్ఞానాపురంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో ఈనెల 11వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తునట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎ. కల్యాణి తెలిపారు. వివిధ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.