రోజురోజుకీ తగ్గుతున్న వినాయక గొడుగుల వాడకం

రోజురోజుకీ తగ్గుతున్న వినాయక గొడుగుల వాడకం

E.G: అనాదిగా వస్తున్న వినాయకుని గొడుగులు వాడకం రోజు రోజుకి తగ్గిపోతోంది. ద్వారపూడి, బిక్కవోలు ప్రాంతాల నుంచి వినాయక చవితి ముందు రాజమండ్రి వచ్చి కుటుంబమంతా వినాయకుని గొడుగులు, పాలవెల్లి అలంకరణ దండలు తయారు చేసి అమ్ముతూ వుంటారు. కానీ ప్రతీ సంవత్సరానికి అమ్మకాలు తగ్గి జీవనం కష్టమైపోతోందని, అలవాటైన వృత్తి వదులుకోలేక శ్రమ పడుతున్నామని విక్రయదారులు  అంటున్నారు.